ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు... 11 ఏళ్లు దాటినా కొలిక్కి రాలేదు. నల్లమల సాగర్‌కు కృష్ణా నది నుంచి నీటిని అందించేందుకు.. సమీప కొల్లం వాగు నుంచి దోర్నాల మండలం కొత్తూరు వరకు 18.82 కిలోమీటర్ల దూరం 7 మీటర్ల వ్యాసంతో తొలి సొరంగం నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
ఈ పనులకు 2008 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంతో మొదలుపెట్టిన పనులు 11 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 17.05 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తైంది. ఇంకా 1.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది. 2020 జులై నాటికి మొదటి సొరంగం పనులు పూర్తిచేసి నీరు అందిస్తామని వైకాపా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి:
వెలుగొండ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేస్తాం: మంత్రి బాలినేని