కరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషి రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని దూపాడు, రాజుపాళెం గ్రామాల్లో.. కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని శేషి రెడ్డి అన్నారు. ఈ నెల 11నుంచి 14 వరకు వ్యాకిన్ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వీలైనంత వరకు దూర ప్రయాణాలు మానుకోవాలని, ప్రజలందరూ వ్యాకిన్ వేయించుకోవాలని కోరారు.
కరోనా బాధితుల పట్ల సామాజిక సృహతో మెలగాలని కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. మార్టూరు మండలం చిమ్మిరి బండలొ టీకా ఉత్సవాన్ని ఆయన పరిశీలించారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్ తీరుపై అసహనం వ్యక్తంచేశారు. వాలంటీర్లు, ఆరోగ్యసిబ్బంది గ్రామీణుల్లో టీకా తీసుకునేలా అవగాహన పెంపొందించాలని తెలిపారు. రైతులు, రైతుకూలీలకు పొలాల నుంచి వచ్చే సమయంలో వ్యాక్సినేషన్ జరిగేలా ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారంతా టీకా తీసుకునేలా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: