ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 172 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గ్రామీణ మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ జీవో అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
- ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, జీవో 172ను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ... విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆందోళన నిర్వహించారు. ఈ జీవోతో ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని, ప్రాథమిక విద్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
- 'మా బడి - మా ఊర్లోనే ఉంచండి' అని పార్వతీపురంలో విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు.
- నూతన జాతీయ విద్యావిధానం అమలుకు జారీ చేసిన జీవో 172 రద్దు చేయాలని.. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ఆలోచనను మానుకోవాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 ద్వారా ప్రాథమిక విద్య... మాతృభాషలోనే బోధించాల్సిన సూచనకు విరుద్ధంగా ఉంటుందని యూటీఎఫ్ నాయకులు అన్నారు.
- గుంటూరు జిల్లా తెనాలిలో ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు... అంగన్వాడీలు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,526 కరోనా కేసులు, 24 మరణాలు
CPI NARAYANA: 'జనాభా పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తారా?'