ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెంలో ఉపాధి హామీ పనులను అద్దంకి డివిజన్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పనుల దగ్గరకు వెళ్లి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. అధికారులు కూలీలకు సరైన సదుపాయాలు కల్పించటం లేదని.. సరైన కూలీ ఇవ్వటం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కూలీలకు అన్ని సదుపాయాలను కల్పించాలని తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి.