ప్రకాశం జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయనపడినవారు బల్లికురవ మండలం వేమవరం గ్రామానికి చెందిన గరికపాటి సుబ్బారావు, మార్టూరు రామ్ నగర్ కు చెందిన మందపాటి దానియేలుగా గుర్తించారు.
సమాచారం తెలుసుకున్న మార్టూరు ఎస్సై శివ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి