ETV Bharat / state

Amaravati Farmer's Mahapadayatra: భారీ వర్షాలతో రెండో రోజూ పాదయాత్రకు బ్రేక్ - Amravati Farmers protest

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఈ రోజు కూడా విరామం ప్రకటిస్తూ.. అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాదయాత్రకు రెండో రోజూ కూడా విరామం ఏర్పడింది.

భారీ వర్షాలతో నేడు పాదయాత్రకు బ్రేక్
భారీ వర్షాలతో నేడు పాదయాత్రకు బ్రేక్
author img

By

Published : Nov 19, 2021, 7:17 AM IST

Updated : Nov 19, 2021, 7:23 AM IST

అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు కూడా విరామం ప్రకటిస్తూ...అమరావతి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాదయాత్రకు రెండో రోజూ కూడా విరామం ఏర్పడింది. శనివారం ఉదయం గుడ్లూరు నుంచి యథావిధిగా యాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పోర్లుతుండటంతో అడ్డంకులు ఏర్పాడ్డాయని ఐకాస తెలిపింది. మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ఐకాస నేతలు స్పష్టం చేశారు.

న్యాయస్థానంలోనూ విజయం సాధిస్తాం...

మహాపాదయాత్రకు రోజురోజుకూ ప్రజల నుంచి స్పందన పెరుగుతోందని అమరావతి రైతులు అన్నారు. తమకు లభిస్తున్న స్పందన చూసి ప్రభుత్వం(Government) తట్టుకోలేకపోతోందని విమర్శించారు. ఇప్పటికీ మంత్రులు మూడు రాజధానులు కట్టి తీరతామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. న్యాయస్థానం(Court)లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

Last Updated : Nov 19, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.