ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. వారిని చూసి పారిపోయే క్రమంలో కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఎం. మధు, సీహెచ్. శ్రీనుతో పాటు మరో యువకుడు కాల్వలో పడిపోయారు. మధు, శ్రీను మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎం. మధు, శ్రీను మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. ఆసుపత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు రోదనలు అందర్నీ కలచి వేశాయి. వారి పిల్లల బేలచూపులు చూసినోళ్ల కంట నీరు ఉబికి వచ్చింది. పోలీసులు భయబ్రాంతులకు గురిచేయటమే తమ వాళ్లు కాలువలోకి దూకి ప్రాణాలు కోల్పోయారని కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఇవీ చదవండి..