ETV Bharat / state

Boat Capsizes: చెరువులో పడవ బోల్తా.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లా నాగరాజుపల్లెలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడవ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు నీటమునిగి చనిపోయారు(three Members Died After Boat Capsizes). మరో యువకుడు సురక్షితంగా ఒడ్డుకు చేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. అదివారం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

boat capsized in a pond at nagarajupalle
చెరువులో పడవ బోల్తా ముగ్గురు మృతి
author img

By

Published : Nov 8, 2021, 9:19 AM IST

ఆ నలుగురూ స్నేహితులు. స్థానికంగా ఉన్న చెరువు వద్దకు వెళ్లినవారికి మృత్యువు పడవ రూపంలో ఎదురైంది. ముగ్గురు నీటమునిగి చనిపోగా(three Members Died After Boat Capsizes).. ఈత రావడంతో ఓ యువకుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు దాసం ప్రసాద్‌(25), కుందేటి మురళీ(23), చొప్పరపు ప్రశాంత్‌ (22), దాసం రామరాజు.. వారం క్రితం అయ్యప్ప మాల ధరించారు. అయితే సమీపంలోని తండా రోడ్డు వెంట ఉన్న చెరువు వద్దకు ఆదివారం ఉదయం వెళ్లారు. అక్కడే ఉన్న పడవ సాయంతో చెరువులో విహరిస్తున్నారు. కాసేపటికే పడవలోకి నీరు చేరింది. క్రమేణా పడవ బోల్తాపడ్డంతో వాళ్లు మునిగిపోయారు(Boat Capsizes in a pond at nagarajupalli in prakasam district). ఈ క్రమంలో రామరాజుకు ఈత రావడంతో ఒడ్డుకు చేరాడు. రామరాజు ఇచ్చిన సమాచారం వరకు మునిగిపోయిన ముగ్గురి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చేపట్టారు. ఒకరి తర్వాత ఒకరి మృతదేహాలు సాయంత్రానికి లభ్యమయ్యాయి.

కన్నీరుమున్నీపర్యంతమైన తల్లింద్రండులు
చేతికి అందివచ్చిన కుమారులు అందని తీరాలకు తరలిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కావడంలేదు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం(Boat Capsizes in prakasam district) అలముకుంది. మృతదేహాలకు శవపరీక్షలు చేసేందుకు కుటుంబ సభ్యులు విముఖత చూపారు. వైకాపా నేత రావి రామనాథంబాబు.. బాధితు కుటుంబాలను పరామర్శించారు.

ఆ కుటంబాల్లో వాళ్లు ఒక్కొక్కరే..
సత్యనారాయణ, నరసమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ప్రసాద్‌ ఒక్కడే కుమారుడు. అతను సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. కుందేటి శ్రీనివాసరావు- వెంకయమ్మకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మురళీ ఉన్నాడు. ప్రస్తుతం బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. చొప్పవరపు హరిబాబుకు అమ్మాయితోపాటు ప్రశాంత్‌ కుమారుడు కాగా.. అతను ఇంటర్‌ పూర్తిచేశాడు. ఆ మూడు కుటుంబాలల్లో ఒక్కొక్కరే అబ్బాయిలు కావడంతో వారి తల్లితండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీచదవండి..

విషాదం : చేపలవేటకు వెళ్లి నలుగురు కుటుంబసభ్యులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.