ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ అధిక సంఖ్యలో నమోదవుతున్నందున మండల స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు వారంలో చివరి మూడు రోజుల సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక వ్యాపార సంఘాలు, అధికారులతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తహసీల్దార్ పుల్లారావు తెలిపారు. నిరుపేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఆహారాన్ని అందించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 88866 16059, 91 2110 2209 ఫోన్ నెంబర్లకు కాల్ చేసినట్లయితే వారి ఇంటి దగ్గరకు వెళ్లి ఆహారం ఉచితంగా అందిస్తామని తహసీల్దార్ తెలిపారు.
ఇదీ చదవండి: 'ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించాలి'
విజృంభిస్తున్న కరోనా.. కనిగిరిలో పూర్తి స్థాయి లాక్డౌన్ - kanigiri lockdown news
కనిగిరి మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులు పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. నిరుపేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి ఆహారాన్ని అందించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ పుల్లారావు చెప్పారు.