ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన అఫ్రిది (20) అనే యువకుడు ఒంగోలులో ఓ ఫ్లెక్సీ దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఫ్లెక్సీ కట్టేందుకు చెన్నుపాటి కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కాడు. ఆ ప్రయత్నంలో భవనంపై నుంచి వెళుతున్న హైటెన్షన్ విద్యుత్తు లైన్‌ను గమనించకపోవడం వల్ల ఫెక్సీ తగిలి విద్యుతాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారి మంటలు ఎగిసిపడి, దహనం అయ్యాడు. పట్టణం మధ్య నుంచి హైటెన్షన్ లైన్ ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ ప్రజలు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం స్పందింది ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
సంబంధిత కథనం