Pula Subbayya Veligonda Project: ప్రకాశం జిల్లా వాసుల సాగు, తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2008లో దోర్నాల మండలం కొత్తూరు నుంచి కొల్లం వాగు వరకు 18.8 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. మూడేళ్లలో పూర్తి కావాల్సిన పనులకు 13 ఏళ్లు పట్టింది. 2009 జూన్‌లో రెండో సగం పనులు మెుదలుపెట్టగా...13 ఏళ్లలవుతున్నా పనులు పూర్తి కాలేదు. నిధులు మంజూరులో జాప్యం, పెరిగిన అంచనాలతో.. ఆలస్యం కాగా.. ఇంకా ఆరు కిలోమీటర్లకు పైగా తవ్వాల్సి ఉంది. 21.8 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పు, 328 క్యూసెక్కుల సామర్థ్యంతో కూడిన ఈ సొరంగం నిర్మాణం పూర్తైతే నల్లమల సాగర్‌కు నీరు చేరుతాయి.
నల్లమల సాగర్ నీటినిల్వ సామర్థ్యం 43.5టీఎంసీలు. వెలిగొండ సొరంగాలు ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నల్లమల సాగర్‌కు వచ్చేలా రూపకల్పన చేశారు. నల్లమల కొండల శ్రేణిలో సహజ సిద్ధంగా ఏర్పడిన సుంకేసుల, కాకర్ల, గొట్టి పడియ వద్ద రిజర్వాయర్లు నిర్మించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి మెుదటి సొరంగం ద్వారా నీరందించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం, అధికారులు సెప్టెంబర్ నాటికి నీరు అందిస్తామని చెబుతున్నా....ఇంకా పూర్తి కాని ప్రాజెక్టు పనుల వల్ల తమ ప్రాంతానికి కృష్ణమ్మ పరవళ్లు ఎప్పుడు వస్తాయోనని ప్రకాశం వాసులు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: నల్లమల సాగర్‌లో వాటర్‌గ్రిడ్.. సెప్టెంబర్ నాటికి సాధ్యమయ్యేనా..!