చీమకుర్తికి చెందిన చర్చి పాస్టర్ చిన్నపురెడ్డికి బ్రాంచ్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు నెల్లూరుకు చెందిన షేక్ గులాబ్ జాన్ . తమ బ్యాంకులో డబ్బులు జమ చేస్తే అధిక వడ్డీ అందిస్తామని ఆశ చూపాడు. మొదటి విడతలో చిన్నపురెడ్డి వద్ద 5 లక్షల రూపాయలు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నాడు జానీ. పాస్టర్కి అనుమానం రాకుండా నెల నెలా వడ్డీ చెల్లించాడు. ఇంకా పెద్ద మొత్తం డబ్బు జమ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చిన్నపురెడ్డి వద్ద నుంచి 43 లక్షల 25 వేల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం డ్రామాకి తెరలేపాడు. 43 లక్షల 25 వేల రూపాయలు ఒకేసారి జమ చేసినందుకు "ఆదాయపన్నుశాఖ అధికారుల కన్ను నీ మీద పడింది" అని చిన్నపురెడ్డిని భయపెట్టాడు. నువ్వు జైలుకు పోవడం ఖాయం అంటూ బెదిరించాడు. పన్ను కట్టాలంటూ పలుమార్లు డబ్బు వసూలు చేశాడు. 400 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. పలుమార్లు ఇదేవిధంగా బెదిరిస్తూ సొమ్ముతో పాటు కోటి రూపాయల విలువ చేసే స్థలాన్ని తన పేరుపై రాయించుకున్నాడు నిందితుడు. చివరికి చిన్నపురెడ్డి కారుని సైతం తాకట్టుపెట్టి నగదు కాజేయటంతో స్పందన కార్యక్రమంలో ఎస్పీని బాధితుడు ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేపట్టి నిందితున్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 లక్షల రూపాయల నగదు, 200 గ్రాముల బంగారం, ఖాళీ ప్రామిసరీ నోట్లు, కోటి రూపాయలు విలువ చేసే స్థలం కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. మొత్తం సొత్తు విలువ కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన సిబ్బందికి నగదు బహుమతి అందజేశారు.
ఐటీ రైడ్స్ పేరుతో దోపిడీ... పాస్టర్ నుంచి కోటి 35 లక్షలు స్వాహా - prakasam paster
పాస్టర్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. మాయమాటలు చెప్పి మాయ చేశాడు. పాస్టర్‌ను భయపెట్టి ఏకంగా కోటి 35 లక్షల రూపాయలు విలువైన సొత్తు కాజేసి దర్జాగా జీవించాడు. చివరికి మోసం బయటపడి జైలు పాలయ్యాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బ్యాంకు మేనేజర్ పేరుతో పాస్టర్ని మాయ చేశాడు ఘరానా మోసగాడు.
చీమకుర్తికి చెందిన చర్చి పాస్టర్ చిన్నపురెడ్డికి బ్రాంచ్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు నెల్లూరుకు చెందిన షేక్ గులాబ్ జాన్ . తమ బ్యాంకులో డబ్బులు జమ చేస్తే అధిక వడ్డీ అందిస్తామని ఆశ చూపాడు. మొదటి విడతలో చిన్నపురెడ్డి వద్ద 5 లక్షల రూపాయలు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నాడు జానీ. పాస్టర్కి అనుమానం రాకుండా నెల నెలా వడ్డీ చెల్లించాడు. ఇంకా పెద్ద మొత్తం డబ్బు జమ చేస్తే అధిక వడ్డీ ఇప్పిస్తానని చిన్నపురెడ్డి వద్ద నుంచి 43 లక్షల 25 వేల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం డ్రామాకి తెరలేపాడు. 43 లక్షల 25 వేల రూపాయలు ఒకేసారి జమ చేసినందుకు "ఆదాయపన్నుశాఖ అధికారుల కన్ను నీ మీద పడింది" అని చిన్నపురెడ్డిని భయపెట్టాడు. నువ్వు జైలుకు పోవడం ఖాయం అంటూ బెదిరించాడు. పన్ను కట్టాలంటూ పలుమార్లు డబ్బు వసూలు చేశాడు. 400 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. పలుమార్లు ఇదేవిధంగా బెదిరిస్తూ సొమ్ముతో పాటు కోటి రూపాయల విలువ చేసే స్థలాన్ని తన పేరుపై రాయించుకున్నాడు నిందితుడు. చివరికి చిన్నపురెడ్డి కారుని సైతం తాకట్టుపెట్టి నగదు కాజేయటంతో స్పందన కార్యక్రమంలో ఎస్పీని బాధితుడు ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేపట్టి నిందితున్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 30 లక్షల రూపాయల నగదు, 200 గ్రాముల బంగారం, ఖాళీ ప్రామిసరీ నోట్లు, కోటి రూపాయలు విలువ చేసే స్థలం కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. మొత్తం సొత్తు విలువ కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన సిబ్బందికి నగదు బహుమతి అందజేశారు.
-----------
ఎస్. ఆర్. పి. పైప్ లైన్ కు గండి.... .....
----------------*
అనంతపురం జిల్లాలో ప్రధాన తాగు నీటి వనరు అయిన శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకానికి చెందిన పైపులైనుకు గండి పడటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పీఏబీఆర్ నుంచి కళ్యాణదుర్గం మీదుగా మడకశిర హిందూపురం నియోజకవర్గం లోని వందలాది గ్రామాలకు నీటి సరఫరా అందించే పైపులైనుకు కళ్యాణ్ దుర్గం శివార్లలో టమోటా మండి ల సమీపంలో గండి పడింది. దీంతో ఆ ప్రాంతంలో వారికి చూడటానికి ఫౌంటెన్ లా అందంగా కనబడ్డా, మంచినీటి సరఫరా మాత్రం అంతరాయం ఏర్పడింది. పైప్ లైన్ లో గండి పడటంతో దాన్ని మరమ్మత్తు చేయడానికి సమీపంలో ఉన్న వాల్వును తెరిచినట్లు, దీంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి నీటి పూర్తిగా ఖాళీ చేయించి చేయించి మరమ్మతు పనులు ప్రారంభించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా