ప్రకాశం జిల్లా దర్శిలోని కురిచేడు రోడ్డులో గల డీ.వీ.ఎస్.నగర్ లో ఓ కోతి బారిన పడి పదిమందికి గాయాలపాలయ్యారు. గత నాలుగు రోజుల నుంచి ఓ వానరం స్థానికంగా ఉండే పిల్లల మీద దాడి చేసి గాయపరుస్తోంది. రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించడానికి భయపడుతున్నారు.
మర్కటం బారిన పడి గాయాల పాలైన వారిని ప్రథమ చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఒంగోలు రిమ్స్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. అధికారులు సత్వరమే స్పందించి కోతి బారి నుంచి తమను కాపాడాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: