ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లోని 26వ డివిజిన్ కార్పొరేటర్ రవితేజ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ... ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద తెదేపా నిరసన చేపట్టింది. టీఎన్ఎస్ఎఫ్ పిలుపు మేరకు ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడిస్తారనే నేపథ్యంలో ముందుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల స్వేచ్ఛను హరించేలా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని తెదేపా నేత కొఠారి నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారనే తెదేపా నాయకులను ముందస్తు అరెస్టులు పేరుతో అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పార్టీ నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా.. కార్పొరేటర్ రవితేజను విడుదల చేశారు.
ఇదీ చదవండి: