ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం రుద్రమాంబపురంలో మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా రుద్రమాంబపురంలో తెదేపా, వైకాపా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తెదేపా కార్యకర్త బసంగారి పద్మపై అదే గ్రామానికి చెందిన 20 మంది వైకాపా నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మసస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 10 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
ఇదీ చదవండి