విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని ఆంటిపేట ఎంపీటీసీ స్థానానికి అధికారులు రీపోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు తప్పుగా నమోదు కావడంతో రీ పోలింగ్‌కు కలెక్టర్ జవహర్లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రీ పోలింగ్‌లో వైకాపా వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ.. తెదేపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున వేరే వారు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.