ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం కామేపల్లిలో... తెదేపా కార్యకర్త లక్కెపోగు సుబ్బారావు హత్య అత్యంత దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత పల్లెలను ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షన్ కేంద్రాలుగా మార్చారని ధ్వజమెత్తారు.
ప్రస్తుత ప్రభుత్వ కక్షపూరిత పాలనలో ఇంకెంతమంది కార్యకర్తలను బలి తీసుకుంటారని లోకేశ్ వైకాపా నేతలను నీలదీశారు. సుబ్బారావు కుటుంబానికి, గాయపడిన కార్యకర్తలకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:
SEC: నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఉపసంహరణ