ప్రకాశం జిల్లాలో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా జిల్లా అధికారులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని యోధుడిగా పోరాడి ఆంధ్ర కేసరిగా ప్రకాశం పంతులు ఘనత సాధించారని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్ధవంతంగా పాలన అందించారని కొనియాడారు. జేసీలు వెంకట మురళి, చేతన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : ఇంటికి వెళ్లాలి అన్న ఆశ సరే.. జాగ్రత్తలు ఏవి