ETV Bharat / state

భూ ఆక్రమణ కేసు.. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ అరెస్టు

భూ ఆక్రమణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్లుపాడు మండలం తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి విచారణ జరిపి భూ అక్రమణలో భాగమైన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

author img

By

Published : Mar 31, 2021, 7:12 PM IST

Tahsildar's office Computer operator arrested in land grab
తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ అరెస్టు

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో జరిగిన భూ ఆక్రమణ ఘటనలో.. తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూమిని తహసీల్దార్​తో సహా.. కింది స్థాయి సిబ్బంది డబ్బులు తీసుకొని ఇతరులకు కట్టబెట్టారు. అప్పట్లో ఈ భూ ఆక్రమణ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పటి కందుకూరు ఆర్డీఓ రామారావును విచారణ అధికారిగా నియమించారు.

ఆక్రమణకు పాల్పడినట్టుగా తేలిన నాటి తహసీల్దార్ విజయభాస్కర్ రెడ్డి.. అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఈ కేసుకు సంబంధించి.. నేడు కంప్యూటర్ ఆపరేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆర్ఐ సాలమ్మ, రమణతో పాటు మరికొంత మంది అధికారులకు భూ ఆక్రమణలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరింత విచారణ చేసి ఈ నేరంలో పాత్ర ఉన్న మిగతా అధికారులపైనా చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవీ చూడండి:

బకాయి సొమ్ము చెల్లించాలంటూ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.