పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కేంద్రప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ -2020లో భాగంగా ప్రతిసంవత్సరం అందించే ర్యాంకుల్లో ప్రకాశం జిల్లా చీరాల పురపాలకసంఘం చోటు దక్కించుకుంది. ఈమేరకు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో చీరాల మున్సిపాలిటీ ఉందని కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి తెలిపారు. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో చీరాల పురపాలకసంఘానికి ప్రకాశం జిల్లా నుంచి స్థానం దక్కిందని తెలిపారు. ఈనెల 20వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ ఈ అవార్డులను ప్రకటించనున్నారు. చెత్త సేకరణ నూతన విధానాలు, సాధించిన ఫలితాలు వల్లే ఈ ర్యాంకు వచ్చిందని అధికారులు, చీరాల ప్రజల సమన్వయంతోనే ర్యాంకు సాధించగలిగామని కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి