Student Died in Suspicious Condition: తల్లిదండ్రులు.. స్వగ్రామానికి వెళ్లారు. ఇంటి వద్ద సోదరుడు, సోదరి మాత్రమే ఉన్నారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి తల్లిదండ్రులు వెళ్లారు. తరువాత సోదరుడు.. పాఠశాలకు వెళ్లాడు. పాఠశాలకు వెళ్లి వచ్చిన ఆ సోదరుడికి ఇంట్లో ఒక్క సారిగా షాక్ తగిలే ఘటనని చూశాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ తన సోదరి మృతి చెంది ఉండటాన్ని చూశాడు. దీనిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మరణానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.
అసలు ఏం జరిగిందంటే.. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పెద్ద చెర్లోపల్లి మండలం పాలేటి పల్లి గ్రామానికి చెందిన శీలం రమణ రెడ్డి, పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె సంధ్య (17) కనిగిరి పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. పిల్లల చదువుల నిమిత్తం తల్లిదండ్రులు స్వగ్రామం వదిలి కనిగిరి పట్టణంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని.. తమ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు.
కాగా వీళ్లు తమ స్వగ్రామమైన పాలేటిపల్లిలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఆ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించేందుకు మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు వెళ్లారు. ఆ సమయంలో.. పిల్లలిద్దరూ ఇంటి వద్దే ఉన్నారు. ఇద్దరి పిల్లలకూ.. జాగ్రత్తలు చెప్పి.. తల్లిదండ్రులు.. స్వగ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిని చూసేందుకు వెళ్లారు.
అయితే ఈ నేపథ్యంలో శుక్రవారం యథావిధిగా మృతురాలి సోదరుడు.. పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ వచ్చి చూసేసరికి.. సంధ్య అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇలా మృతి చెంది ఉండటాన్ని చూసిన మృతురాలి సోదరుడు.. వెంటనే తన కుటుంబ సభ్యులకు తెలిపాడు.
దీంతో హుటాహుటిన మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వస్తుండడంతో.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: