ప్రకాశం జిల్లాలోని ప్రతిపాదిత రామయ్యపట్నం పోర్టు స్థలాన్ని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. పోర్టుకు ఉన్న సానుకూల అంశాలు, అవసరమైన స్థలం, నీటి వసతి వంటి వివరాలను కలెక్టర్ పోల భాస్కర్ మంత్రికి వివరించారు. పోర్ట్ నిర్మాణానికి 3500 ఎకరాలు అవసరం కాగా ఇతర పారిశ్రామిక అవసరాలతో కలిపి మొత్తం 5 వేల ఎకరాలు సమకూర్చుకుంటున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
పోర్టుకు సంబంధించి ఆగస్టులో టెండర్లు పిలుస్తామని అన్నారు. నీటి వసతికి రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి మళ్లిస్తామని... ఈలోగా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ నీటిని వినియోగించుకుంటామని మంత్రి అన్నారు. రామయ్యపట్నం పోర్ట్ ప్రాంతాన్ని ఢిల్లీ, ముంబయి పారిశ్రామిక కారిడార్ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లంక గ్రామాల ప్రజల రాత మారదా! నీటి మోక్షం కలగదా!