ETV Bharat / state

చిట్టి బొమ్మలు.. చిన్ని చిన్ని చిత్రాలు.. ఓ ప్రధానోపాధ్యాయురాలు. - ప్రత్యేకమైన బొమ్మలను తయారు చేస్తున్న కనిగిరి మహిళ

పనికి రాని వస్తువులు కూడా... ఆమె చేతిలో పడగానే కళాఖండాలు రూపుదిద్దుకున్నాయి. మట్టి, చిన్న చిన్న రాళ్లు, పాడైన కోడి గుడ్డు... కాదేది ఆమె కళకు అనర్హం. అలాగే ప్రతి బొమ్మల్లోను జీవకళను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతోంది. అంతేనా ప్రతి చిత్రంలోను తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా తీర్చిదిద్దటం ఆమె ప్రత్యేక శైలి.

special toys designed
చిట్టి బొమ్మలు.. చిన్ని చిన్ని చిత్రాలు.. ఓ ప్రధానోపాధ్యాయురాలు.
author img

By

Published : Jan 7, 2021, 8:59 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన ప్రమీలాకుమారి... కనిగిరి మండలం చాకిరాల గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. పాడైన కోడి గుడ్డు పెంకులతో, చిన్న చిన్న రాళ్లు, మట్టితో రకరకాల బొమ్మలు, చిత్రాలను గీయటం ఆమె అభిరుచి. వాటికి తగిన రంగులను అద్ది జీవకళను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతూ ఉంటారు. స్వతహాగా బొమ్మలు గీసే అలవాటున్న ఆమె కరోనా సమయంలో వృథాగా పడేసిన వాటిని ఏదో విధంగా ఉపయోగంలోకి తీసుకరావాలని సంకల్పించారు. కోడి గుడ్డు పై అనేక రకాల చిత్రాలను గీసి వాటికి రంగులు వేసి పలువురి చేత ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకా రాళ్లపై రకరకాల చిత్రాలు, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మట్టి బొమ్మలను తయారు చేసి భళా అనిపించుకుంటున్నారు. తాను విధులు నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యార్థులకు ఇటువంటి చిత్ర కళను నేర్పిస్తున్నట్లు ప్రమీలాకుమారి తెలిపారు.

చిట్టి బొమ్మలు.. చిన్ని చిన్ని చిత్రాలు.. ఓ ప్రధానోపాధ్యాయురాలు.

ఇదీ చదవండీ...ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటున్న చిట్వేల్- రాపూరు రోడ్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.