ETV Bharat / state

E-VEHICLES: ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు.. సామాన్యులకు అందుబాటులో ధరలు - e-bikes at parkas district

నింగినంటుతున్న ఇంధన ధరలు.. వాహనదారుల్ని ప్రత్యామ్నాయాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. పెట్రోల్‌ గొడవ లేకుండా అందుబాటు ధరలకే దొరికే ఈ-బైక్‌(E-BIKE)లు వాహనదారుల్ని ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే కావడం, ప్రభుత్వాలూ రాయితీ ఇస్తుండటంతో వ్యాపారులు కూడా వీటి విక్రయాలపై ఆసక్తి చూపుతున్నారు.

electric vehicles at parkas district
ఆకర్షిస్తున్న ఈ- బైకులు
author img

By

Published : Aug 28, 2021, 4:22 PM IST

ఈ-వాహనాల పట్ల ప్రజల ఆసక్తి

పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్యుడికి సొంత వాహన ప్రయాణం కూడా ఓ గుదిబండలా మారుతోంది. ప్రత్యామ్నాయాల అన్వేషణలోఉన్నవారికి ఈ-వాహనాలు (E-VEHICLES) ఊరటనిస్తున్నాయి. బ్యాటరీలతో నడిచే ఈ-వాహనాలను వివిధ సంస్థలు విరివిగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. మొదట్లో ఇది కాస్త ఖరీదైన వ్యవహారంగా ఉండగా.. ఇప్పుడు కొన్ని మార్పులు చేసి మధ్యతరగతి వారికీ అందుబాటు ధరల్లో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.

ఆసక్తి చూపుతున్న వాహనాదారులు

ప్రకాశం జిల్లాలో ఈ-బైక్‌(E-BIKE)ల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.పెట్రోల్‌ బాదుడు నుంచి తప్పించుకోవడం సహా, కాలుష్యరహితం, అందుబాటు ధరల్లో ఉండటంతో వీటి కొనుగోలుకు వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. 6 గంటల పాటు ఛార్జ్ చేస్తే.. 90 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసే అవకాశం ఉన్న ఈ-బైక్‌లు వాహనదారుల్ని ఆకర్షిస్తున్నాయి. సైకిల్‌లా కనిపించే ఈ-వాహనాలు 150 కిలోల బరువును మోయగలవు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

రూ. 40 వేల నుంచి అందుబాటులో..

మూడు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ-బైక్‌లు.. 40 వేల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయని విక్రయదారులు చెబుతున్నారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధరలో మార్పులు ఉంటాయని అంటున్నారు. పర్యావరణహితమైన ఈ వాహనాలకు ప్రభుత్వాలు మరింత రాయితీ అందించి ప్రోత్సహించాలని వాహనదారులు, అమ్మకందారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

BEACH CORRIDOR: విశాఖ బీచ్ కారిడార్​లో పర్యాటకం పరుగులు.. అభివృద్ధికి సర్కారు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.