ETV Bharat / state

రెడ్​జోన్​లో బులెట్​పై రైడ్​ చేస్తూ సందర్శించిన ఎస్పీ

author img

By

Published : Apr 20, 2020, 7:21 AM IST

చీరాలలో ఎస్పీ సిద్ధార్ధ్​ కౌశల్​ ఒకటవ పట్టణ పోలీస్​ స్టేషన్​ను సందర్శించారు. పోలీస్​ సిబ్బందికి బియ్యం, నూనె ప్యాకెట్లను అందజేశారు. అనంతరం బుల్లెట్​పై పట్టణంలో తిరుగుతూ పోలీసులను ఉత్సాహపరిచారు. రెడ్​జోన్​ ప్రాంతాలను పరిశీలించి పోలీసులుకు సూచనలు ఇచ్చారు.

sp visited chirala redzone areas
బులెట్​పై చీరాల రెడ్​జోన్​ ప్రాంతాలు సందర్శించిన జిల్లా ఎస్పీ సిద్దార్ధ్​ కౌశల్​

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్​ కౌశల్​ అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్​లో పొలీస్ సిబ్బంది, హొంగార్డులకు బియ్యం, నూనె ప్యాకెట్లను ఎస్పీ సిద్దార్ కౌశల్ అందచేశారు. చీరాల పట్టణంలో బులెట్​పై తిరుగుతూ విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఉత్సాహపరిచారు. చీరాల నవాబ్ పేట, పేరాల ప్రాంతంలోని మసీద్ కూడలిలో రెడ్​జోన్ ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రెడ్​జోన్ ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేవని, నిత్యవసర వస్తువులు సైతం అవసరమైతే ఇంటికే పంపిస్తామన్నారు. లాక్​డౌన్ కాలంలో తమ విధులుకు ఆటంకం లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల కోసమే పోలీస్, వైద్య, మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నారని దయచేసి అర్థం చేసుకుని ఇంటికే పరిమితం అవ్వండి అంటూ ప్రజలను ఎస్పీ కోరారు.

ఇదీ చదవండి :

సినీ ఫక్కీలో వెంటాడి.... భారీగా గంజాయి పట్టివేత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.