ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో.. కుమారుడితో కలిసి వెళ్తున్న వ్యక్తితో పోలీసులు స్పందించిన తీరుపై.. ఆ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు. తన కార్యాలయానికి పిలిచి పోలీసుల తరఫున క్షమాపణలు కోరారు. ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పురిణి రాంబాబు.. అతని కుమారుడితో కలిసి రెండు రోజుల క్రితం ఒంగోలులోని ఆసుపత్రికి వెళ్లారు. బైక్పై తిరిగి వస్తున్న సమయంలో వారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాక్డౌన్ సమయంలో బయటకు ఎందుకు వచ్చావని, మాస్కులు ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. కొత్తపట్నం ఎస్ఐ శ్రీనివాసరావు.. వారితో కఠినంగా శిక్షించారు. లాఠీతో కొట్టారు. చెంప ఛెళ్లుమనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారగా.. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది.
వెంటనే స్పందించిన ఎస్పీ కౌశల్.. బాధితులను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పోలీసుల తరఫున క్షమాపణలు కోరారు. ఘటనపై ఒంగోలు టౌన్ డీఎస్పీతో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి కరోనాపై అవగాహన కల్పించారు. మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. జిల్లాలోని పోలీసులు సహనం కోల్పోయి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: