ETV Bharat / state

ప్రేమికుడిని అరెస్టు చేసిన ఎస్సై... వీఆర్​కు పంపిన ఎస్పీ

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై తప్పుడు కేసు పెట్టి, వరుడిని జైలుకు పంపించిన ఘటనలో ఎస్సైపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ చర్యలు తీసుకున్నారు. నూతన దంపతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రేమికుడిని అరెస్టు చేసిన ఎస్సై.. వీఆర్​కు పంపిన ఎస్పీ

author img

By

Published : Nov 30, 2020, 9:58 PM IST

టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలేనికి చెందిన భార్గవి, ఒంగోలులో నివాసముంటున్న సమీప బంధువైన మహేష్‌ ప్రేమించి, పెద్దల అంగీకరం లేకుండా గుడిలో పెళ్లి చేసుకుంది. ఈ వివాహం భార్గవి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవి మానసిక స్థితి బాగుండదని, ఎంబీబీఎస్ చదువును కూడా ఈ కారణంగానే మధ్యలో ఆపేసిందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. బలవంతంగా ఆమెను మహేష్ పెళ్లి చేసుకున్నాడంటూ టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి చేసుకున్నాక.. భార్గవి, మహేష్ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. వారు భార్గవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదునే.. నమోదు చేశారు. మహేష్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇద్దరూ మేజర్లు అయినా, వీరి అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో, భార్గవి ఒంగోలు వచ్చి స్పందనలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్పీ వెంటనే స్పందించి, టంగుటూరు ఎస్సైపై చర్యలకు ఉపక్రమించారు. వెకన్సీ రిజర్వు (వీఆర్)కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన దంపతులను తగిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: విశాఖ పోర్టుకు తొలిసారి భారీ నౌక రాక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.