రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే వారిపై షీట్లు ఎత్తివేస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ చెప్పారు. ఒంగోలులో రౌడీ షీటర్లకు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో ఏ,బి,సి కేటగిరిగా రౌడీ షీటర్లను విభజించామన్నారు.
ఏ గ్రేడులో ఉన్న రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. వారు నేరం చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ ల అధికారి భాద్యులవుతారని చెప్పారు. సి గ్రేడులో ఉన్న రౌడీ షీటర్ల ప్రవర్తన బాగుంటే వారిపై ఉన్న షీట్లు ఎత్తివేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: