ETV Bharat / state

త్వరలో ప్రకాశం జిల్లాలో 75 ధ్యాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు - News of grain buying centers in Prakasam district

త్వరలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 75 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. సేకరించిన ధాన్యానికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందని, పాత బకాయిలు కింద బ్యాంకర్లు జమ చేసుకుంటారనే భయం రైతులకు ఉండనక్కర్లేదన్నారు. జిల్లాలో 17వేల మంది వరి పండించే రైతులున్నారని, వీరిందరి పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయలకు ఆదేశించామన్నారు.

త్వరలో ప్రకాశం జిల్లాలో 75 ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

author img

By

Published : Nov 6, 2020, 12:14 PM IST

త్వరలో ప్రకాశం జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంయుక్త కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 75 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో 60వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరిస్తామన్నారు. ఇంకా అవసరమైతే అదనంగా సేకరించడానికి సిద్దంగా ఉంటామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర గ్రేడ్‌ ఏ క్వింటాలుకు రూ.1888, కామన్‌ ధర రూ. 1868 చొప్పున చెల్లిస్తామని, అంతకన్నా ఎక్కువ ధర ఉంటే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు.

  • సేకరించిన ధాన్యానికి నేరుగా బ్యాంకు ఖాాతాలోనే నగదు జమ

సేకరించిన ధాన్యానికి నేరుగా వారి బ్యాకు ఖాతాలో నగదు జమ అవుతుందని, పాత బకాయిలు కింద బ్యాంకర్లు జమ చేసుకుంటారనే భయం రైతులకు ఉండనక్కర్లేదన్నారు. ముఖ్యమంత్రి ఆ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. మిల్లర్లు ధాన్యం సేకరణ సమయంలో ఏమైనా అవకతవకలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పలు మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టామని అన్నారు. కొనుగోలు కేంద్రాలనుంచి ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో 17వేల మంది వరి పండించే రైతులున్నారని పేర్కొంటూ, వీరిందరి పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయాలని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయలను ఆదేశించామన్నారు.

  • కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోళ్లు

జిల్లా పండించే పత్తి కొనుగోళ్లకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జేసీ తెలిపారు. జిల్లాలో దాదాపు 6 లక్షల క్వింటాళ్లు పత్తి పండించినట్లు అంచనాలు ఉన్నాయని, ఈ మొత్తం కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సీసీఐ ద్వారా మార్కాపురం మార్కెట్‌ యార్డు, పరుచూరు మండలం దగ్గుపాడులో కామాక్షి కాటన్‌ ఇండస్ట్రీ, నాగులపాడులో వెంకటేశ్వరా జిన్నింగ్‌ మిల్లు వద్ద కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సీసీఐ ద్వారా లాంగ్ స్టెబుల్‌ కాటన్‌ క్వింటాల్ ధర రూ.5825 , మీడియం స్టేబుల్‌ కాటన్‌ ధర 5515 రూపాయలు చొప్పున మద్దతు ధర లభిస్తుందని ఆయన తెలిపారు. మద్దతు ధరకు ఎక్కువ స్థాయిలో ప్రయివేట్‌ వర్తకులు ఇస్తే విక్రయించుకోవచ్చు సూచించారు.

  • ఎంత పంటైనా కొనటానికైనా సిద్దం

ఇప్పటికే జొన్నలు కొర్రలు, సజ్జలు కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరిస్తున్నామని, మొత్తం పంటంతా ప్రభుత్వమే కొనాలని లేదని అన్నారు. రైతుకు సాధ్యమైనంత మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడానికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒక వేళ ప్రయివేట్‌ వ్యాపారులు వల్ల ఇబ్బందులు పడుతున్నాం... గిట్టుబాటు కావడంలేదంటే కొనుగోలు కేంద్రాలు పెంచుతామని అన్నారు. ఎంత పంటైనా కొంటామని జేసీ పేర్కొన్నారు. రవాణా ఛార్జీలు, గోదాములు అద్దెలు వంటివి ప్రభుత్వానికి భారమైనా, వాటని కూడా లెక్క చేయకుండా కొనుగోళ్ళైతే కొనసాగిస్తామని ఆయన అన్నారు.

ఇవీ చదవండి

చీరాలలో భారీగా పోలీస్ బందోబస్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.