ప్రకాశం జిల్లా చీరాలలో.. రాజస్థాన్ కళాకారులు తయారు చేసి తీసుకొచ్చిన మట్టి పాత్రలను అమ్ముతున్నారు. వివిధ కళాకృతుల్లో చేసిన మంచినీటి సీసాలు, చపాతీ, అట్లు చేసే పెనాలు ఉన్నాయి. పాతకాలంలో మట్టిపాత్రల్లో వండుకుని తినేవారు. ఆ పాత్రల్లో వండిన వంటకాల్లో పోషక విలువలు ఉంటాయని.. ప్రజలు మళ్లీ వాటి వాడకం మొదలుపెడుతున్నారు. ఇప్పటి తరం వారు వాడే వంట సామగ్రికి తగ్గట్టు పలు ఆకృతుల్లో వస్తువులు అందుబాటులో ఉంచారు. పట్టణ ప్రజలు ఆసక్తి చూపిస్తూ కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నల్ల పసుపు-నల్ల గోధుమలతో ఆరోగ్యం.. ఆదాయం