ETV Bharat / state

సర్పంచ్ భర్త మృతి తీరుపై విచారణ చేయాలి: గొట్టిపాటి - అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్

ప్రకాశం జిల్లాలో తెదేపా మద్దతుదారుగా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి భర్త అనుమానాస్పదంగా మృతి చెందడంపై.. బాధిత కుటుంబాన్ని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

gottipati ravikumar visit sarpanch family
సర్పంచ్​ అభ్యర్థి కుటుంబాన్ని పరామర్శించిన తెదేపా నేత
author img

By

Published : Feb 8, 2021, 9:34 PM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపరచిన సర్పంచ్ అభ్యర్థి మరియమ్మ భర్త అర్జున్ నాయక్... గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని అర్జున్ నాయక్ పార్ధివదేహానికి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అర్జున్ నాయక్ అనుమానాస్పద మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

ఇదీ చదవండి:

సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.