ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తన వంతు సాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ. 3.25 లక్షలు అందించారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ నగదును స్థానిక ప్రజా ప్రతినిధుల చేత అందజేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :