ETV Bharat / state

'ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటివారికైనా శిక్ష' - corona cases in prakasam dst

ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాంబాబు తెలిపారు. ఇప్పటికే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను, ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు.

sand illegal transports lorries and tractors seized in prakasam dst

author img

By

Published : May 10, 2020, 4:58 PM IST

ఇసుక అక్రమంగా తరలిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని.. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సి.ఐ రాంబాబు హెచ్చరించారు. మూడు రోజుల క్రితం మోటుపల్లి ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లను చినగంజాం, వేటపాలెం పోలీసులు పట్టుకున్నారు.

చినగంజాం ప్రాంతాల్లొ 2014 సంవత్సరం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న 23 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. వేటపాలెం, మోటుపల్లి, చినగంజాం, పెదగంజాం, కడవకుదురు రహదారుల్లొ పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతుంటారని చెప్పారు.

ఇదీ చూడండి:

అత్యంత అరుదు.. 5 కిలోల బరువుతో పాప జననం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.