ఉద్యోగానికి ఎంపిక అవ్వాలన్న వారి ఆశయం బలంగా ఉన్నా... గ్రంథాలయంలో సదుపాయాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. పరీక్షలకు కావాల్సిన మెటీరియల్స్ లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడుతున్నారు. లైబ్రరీలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్న కారణంతో పుస్తకాలు తెచ్చుకుని మరీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. పుస్తకాల కొరత విషయం గ్రంథాలయ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా.... పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు వాపోయారు.
గ్రంథాలయంలో కుర్చీలు, స్టడీ టేబుళ్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో పాఠకులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ తర్వాత నిరుద్యోగులు ఎక్కువుగా వస్తున్నారని ... వారికి సంబందించిన మెటీరియల్స్ కొరత ఉన్నమాట వాస్తవమేనని గ్రంథాలయ సిబ్బంది చెబుతున్నారు. త్వరలోనే పుస్తకాలు అందుబాటులోకి తెస్తామంటున్నారు.
జిల్లా గ్రంథాలయంలో సరైన సదుపాయాలు, పుస్తకాలు లేకపోవడం పట్ల విద్యార్థులు, నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: