ETV Bharat / state

సచివాలయం ఏఎన్​ఎం కౌన్సెలింగ్​లో గందరగోళం - ప్రకాశం జిల్లాలోని సచివాలయానికి ఎంపికైన ఏఎన్​ఎం

ప్రకాశం జిల్లాలో సచివాలయానికి ఎంపికైన ఏఎన్​ఎం ఉద్యోగాల కౌన్సెలింగ్​ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ర్యాంకుల వారీగా పిలుస్తారేమోనని అభ్యర్థులు వేచి చూశారు. కానీ అభ్యర్థులు ఎక్కువమంది రావటంతో తోపులాట జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు.

సచివాలయం ఏఎన్​ఎం ఉద్యోగాల కౌన్సిలింగ్​లో గందరగోళం
author img

By

Published : Oct 7, 2019, 8:40 PM IST

సచివాలయం ఏఎన్​ఎం కౌన్సెలింగ్​లో గందరగోళం

సచివాలయం ఏఎన్ఎం ఉద్యోగాల కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్​లో గందరగోళం చోటు చేసుకుంది. సరైన ప్రణాళిక లేకుండా అభ్యర్థులను కౌన్సెలింగ్​కు పిలిచినందున మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మౌళిక సదుపాయాల కల్పనలో జిల్లా వైద్యాధికారులు విఫలమయ్యారు. ర్యాంకుల వారీగా పిలుస్తారేమోనని అభ్యర్థులు ఉదయం 9 గంటలకే డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కువమంది కార్యాలయానికి రావటంతో తోపులాట జరిగింది. అధికారులపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో కౌన్సెలింగ్​ నిర్వహిస్తే బాగుండేదని సూచించారు. ర్యాంకుల వారీగా పిలుస్తారని గంటల తరబడి కార్యాలయం ముందు వేచి ఉన్నా ప్రయోజనం లేదని వెళ్లిపోయారు. మరికొంత మంది అభ్యర్థులు తమకు కౌన్సెలింగ్​లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు. కేవలం కొత్త రిజిస్ట్రేషన్​ అనే సాకుతో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి నిబంధన లేదన్నారు. అధికారులను కలిసినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి :

అధిక విద్యార్హతే శాపమా..బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ఆవేదన

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.