ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం బీ. నిడమానూరులో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్‌లు ప్రారంభించారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు ఇక మీదట ఈ కేంద్రాల్లో లభిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకోసం నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు.
అన్నదాతలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు వంటి వివిధ రకాల ఉత్పత్తులు భరోసా కేంద్రంలోనే లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్ బాబు, కలెక్టర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు