ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెంలో బ్యాంకుల వద్ద ప్రజలు బారుల తీరారు. దీంతో ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి. ఓ పక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా... ప్రజలు మాత్రం కనీస జాగ్రత్తలు పాటించటం లేదు.
చీరాల మండలం జాండ్రపేట ఆంధ్రాబ్యాంకు వద్ద భౌతిక దూరం పాటించకుండా ప్రజలు బారులు తీరారు. వీరిలో కొంతమంది మాస్కులు సైతం ధరించలేదు. భౌతిక దూరం పాటించకుంటే.. వైరస్ వ్యాపిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: