ETV Bharat / state

నిరుద్యోగ యువతకు ఆశాదీపం..రూడ్‌ సెట్‌

గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ఆ సంస్థ ప్రధాన లక్ష్యం. పెద్దగా చదువుకోని, ఉద్యోగ అవకాశాలు లేవని నిరుత్సాహపడే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. స్వయం ఉపాధి శిక్షణలు ఇస్తూ..వారు నిలదొక్కుకునే వరకూ పర్యవేక్షిస్తుంది.

rudseti
రూడ్‌ సెట్‌ శిక్షణ
author img

By

Published : Dec 19, 2020, 4:49 PM IST

రూడ్‌ సెట్‌ శిక్షణ సంస్థ

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూడ్‌ సెట్‌) వేలాదిమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. పెద్ద చదువులు చదవలేని, ఉద్యోగ అవకాశాలు రావని నిరుత్సాహపడే యువతకు ఈ సంస్థ మార్గదర్శకం చూపుతుంది. స్వయం ఉపాధి కోసం శిక్షణలు ఇచ్చి యువతలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. చాలా సంస్థలు ఇలాంటి శిక్షణ ఇస్తుంటాయి. ట్రైనింగ్​ అనంతరం ఎవరు ఏం చేస్తున్నారనేది పట్టించుకోరు. కానీ రూడ్​సెట్​లో శిక్షణ పొందిన వ్యక్తి ఉపాధి మార్గాన్ని సరిగ్గా ఎంచుకున్నాడా..లేదా..అని వారిపై దృష్టి పెట్టి, సరైన మార్గంలో నడిపిస్తారు.

ఇక్కడ ఉచితంగా ట్రైనింగ్​ పొందిన యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. కుటుంబాన్ని పోషించుకోవడమే కాదు.. మరికొద్ది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతంత మాత్రం చదువుకున్నవారు కూడా ఇక్కడ శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొంది చిరు వ్యాపారులుగా, సాంకేతిక నిపుణులుగా ఎదుగుతున్నారు. సాంకేతిక అంశాలు నేర్పించటమే కాక..శిక్షణ పొందిన వారు నిలదొక్కుకునే వరకూ పర్యవేక్షణ ఉంచడం ఈ సంస్థ ప్రత్యేకత.

1988లో మొదలైన ప్రస్థానం..

శ్రీ ధర్మస్థల మంజూనాధేశ్వర ఎడ్యూకేషన్‌ ట్రస్టు వ్యవస్థాపకులు వీరేంద్ర హెగ్డే ఈ సంస్థను స్థాపించారు. జిల్లాలో ఈ శిక్షణా సంస్థను 1988లో వేటపాలెంలో మొదలు పెట్టారు. జాతీయ స్థాయిలో దాదాపు 27 కేంద్రాలు ఉన్నాయి. కెనరా బ్యాంకు ఆర్థిక సహకారంతో శిక్షణా సంస్థ నిర్వహిస్తున్నారు.

కోర్సులు..

ఇక్కడ ఎలక్ట్రికల్‌, మోటార్‌ రివైండింగ్‌, సెల్ ఫోన్‌ రిపేర్లు, ఫోటోగ్రఫీ, ఏసీలు, బైక్​ రిపేర్లు, కంప్యూటర్‌, డ్రైవింగ్‌, పాడి పరిశ్రమ, మహిళలకు టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సులు, పచ్చళ్ల తయారీ, మగ్గం వర్స్క్​.. ఇలా సుమారు 60 రకాల కోర్సులలో శిక్షణ ఇస్తారు.

ఆయా కేటగిరిని బట్టి 10 రోజుల నుంచి 30 రోజుల వరకూ ఇక్కడే ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. శిక్షణ ఇచ్చి, ధృవీకరణ పత్రం అందిస్తారు. స్వయం ఉపాధికి బ్యాంకు రుణాలు పొందేందుకు సహకారం అందిస్తారు. కేవలం ఆయా వృత్తుల నైపుణ్యాలే కాకుండా భావ వ్యక్తీకరణ, మార్కెటింగ్‌ స్కిల్స్​ వంటివి కూడా నేర్పిస్తారు.

"ఈ సంస్థలో ఇప్పటివరకూ సుమారు 18,500 మంది యువతీ, యువకులు శిక్షణ పొందారు. స్వయం ఉపాధి లేదా ఉద్యోగాలు పొందినవారు దాదాపు 70 శాతం మంది ఉంటారు. ఇక్కడే శిక్షణ పొంది, బోధకులుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు" -యుగంధర్‌, ఫోటోగ్రఫీ బోధకుడు, పూర్వ విద్యార్థి

"గ్రామీణ యువతకు స్వయం ఉపాధి పొందే లక్ష్యంగా ఏడాది పొడువునా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. కెనారా బ్యాంకు ఆర్థిక, సాంకేతిక సహకారంతో ఈ శిక్షణా సంస్థను నిర్వహిస్తున్నాం" -శ్రీకాంత్‌, సంస్థ ప్రతినిధి

ఇదీ చదవండి: ఒంగోలుకు తందూరి ఛాయ్​ రుచి చూపించాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.