ప్రభుత్వ అధికారులు పొందుతున్న సదుపాయాలన్నీ విలీన అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు కొనసాగించాలని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ విలీన నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ బకాయిల విషయంలో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని కోరారు. ఎస్ఎస్బీటీ, ఎస్బీటీ, సీసీఎస్లను యదాతథంగా కొనసాగించాలని కోరారు. కొంతమంది ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు అమలుచేయడంలో అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. విలీన అనంతరం ఎంప్లాయిస్ యూనియన్ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పారు.
ఇదీ చూడండి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కార్మికుల హర్షం