చీరాల రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురికి తీవ్రగాయాలు - road accidet at prakasam dst chirala 3 injured
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్రగాయలయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని రహదారిపై ఈ ఘటన జరిగింది. మేదరమెట్ల నుంచి చీరాల వస్తున్న కారు... జాండ్రపేట వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. క్షతగాత్రులను చీరాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.