ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట ఎస్త్సె రవీంద్రారెడ్డి... తుర్లపాడు నుంచి మార్కాపురానికి జీపులో వెళ్తున్నాడు. వాహనాన్ని మార్కాపురం కోర్టు కూడలి వద్ద యూ టర్న్ తీసుకున్నారు. సిగ్నల్స్ వేయకపోవటంతో అటుగా వస్తున్న బైక్ను పోలీసు జీపు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు హర్షద్కు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా మారటంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి