ప్రకాశం జిల్లాలో అద్దంకి, చీమకుర్తి, కందుకూరు, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో సుబాబుల్ (river tamarind farmers), జామాయిల్ తోటలు సాగు చేస్తున్నారు. ఇదివరకు రాష్ట్రం మొత్తం ఐదు లక్షల ఎకరాల వరకు సాగు ఉంటే.. ఒక్క ప్రకాశం జిల్లాలోనే అందులో సగం వరకు సాగయ్యేది. గిట్టుబాటు ధర కూడా లభించేది. 2015లో అప్పటి ప్రభుత్వం జామాయిల్ టన్నుకు 4వేల4వందలు, సుబాబుల్ టన్నుకు 4 వేల 2 వందలుగా మద్దతు ధర నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. క్రమంగా కంపెనీలు ఒప్పందానికి తూట్లు పొడవడంతో.. మద్దతు ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం టన్నుకు వెయ్యి రూపాయలు కూడా గిట్టుబాటు అవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. టన్నుకు 5 వేల రూపాయల మద్దతు ధర కల్పిస్తామని మాటిచ్చారని.. అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోలేదని రైతులంటున్నారు. కొందరు సాగును వదిలేసి ప్రత్యామ్నాయం చూసుకుంటే.. మరికొందరు ఉన్న కర్రలని అమ్మేసి అదే కర్ర పనికి కూలీకి వెళ్తున్నామని చెబుతున్నారు. కర్ర కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదని, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర 5 వేలకు పెంచాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: badvel by elections: ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలి: సీఎం జగన్