అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలికి అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు రెవిన్యూ అధికారులు. కర్నూలు జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన లక్ష్మి దేవమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. లక్ష్మిదేవమ్మ కుమారుడితో పాటు మనుమడు మరో ఇద్దరు కరోనా సోకి అనారోగ్యంతో ఉన్నారు.
ఈ క్రమంలో.. ఆ వృద్ధురాలి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గడివేముల మండల తహాసీల్దార్ నాగమణి, పంచాయతీ కార్యదర్శి సలీం, వీఆర్వో వెంకట కృష్ణ, వీఆర్ఎ చంద్ర.. కలిసి ఆమెకు అంత్య క్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:
హెచ్‌పీసీఎల్ ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా విచారణ బృందం ఏర్పాటు