ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులు గత 4రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్శి తహసీల్దార్ అశోకవర్ధన్... తమను చులకనగా చూస్తున్నారని డిప్యూటీ తహసీల్దార్‌కు వీఆర్వోలు వినతిపత్రం ఇచ్చారు. మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తామందరం సామూహిక సెలవు తీసుకుంటామని ఈనెల 7న డీటీకి లేఖ రాశారు.
స్థానిక ఆర్డీవోను కలిసి వీఆర్వోలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఆర్డీవో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్డీవో కోసం కార్యాలయం వద్ద ఎదురుచూశారు. కానీ రాలేదు. తహసీల్దార్ కూడా విధులకు రాకపోవడంపై అనుమానాలు రేకెత్తాయి. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు విధులకు హాజరుకాబోమని వీఆర్వోలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రజా సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్యే కరణం బలరాం