రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీరాలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన ప్రదీప్ కుమార్.. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. 216 జాతీయ రహదారి మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తూ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ముందువెళ్తున్న బైకును ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో ప్రదీప్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: