ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జర్నలిస్టు అల్లు రామచంద్రారెడ్డి కుటుంబానికి తోటి విలేకరులు ఆర్ధిక సహకారం అందించి తమ దాతృత్వం చాటుకున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రామచంద్రారెడ్డి.. ఓ పత్రికలో పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఇటీవల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తోటి విలేకరులు ఆయనకు సంతాపం తెలిపారు.
ప్రెస్ క్లబ్‌కు చెందిన వాట్సాప్ గ్రూప్ వేదికగా ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేశారు. మీడియా మిత్రుల ద్వారా సేకరించిన రూ.57 వేల నగదు, 8 బస్తాల బియ్యాన్ని రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఇదీ చదవండి…