ETV Bharat / state

కనిగిరిలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసు సుఖాంతం - real estate Kidnap news in kanigiri

ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపిన గ్రానైట్​, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సెల్​ఫోన్​ సిగ్నల్స్​ ఆధారంగా కిడ్నాప్​న​కు గురైన వ్యక్తిని గుర్తించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

కనిగిరిలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసు సుఖాంతం

author img

By

Published : Feb 10, 2020, 10:42 AM IST

కనిగిరిలో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కిడ్నాప్​ కేసు సుఖాంతం

ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నాప్​న​కు గురైన గ్రానైట్​, రియల్​ ఎస్టేట్​ వ్యాపారి కేసు సుఖాంతమైంది. ఎప్పటిలాగానే తన పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న షేక్​ లతీప్​ను ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. అనంతరం కిడ్నాప్​నకు గురైన లతీప్ సెల్​ఫోన్ సిగ్నల్స్​ను ట్రేస్ చేసి... దొనకొండ క్రాస్​రోడ్ వద్ద గుర్తించారు. బాధితుడి వద్దకు చేరుకున్న పోలీసులు వెంటనే అతన్ని కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం లతీప్​ని విచారించగా గత కొంత కాలంగా గ్రానైట్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య నెలకొన్న వివాదమే కిడ్నాప్​నకు కారణమని తెలిపారు. కిడ్నాప్​ చేసిన వ్యక్తులు పెదారికట్ల జంక్షన్ మీదుగా తనను తీసుకెళ్తూ... కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు లతీప్​ వివరించాడు. అనంతరం దొనకొండ క్రాస్​రోడ్ వద్ద తనను వదిలి వెళ్లారని పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కర్నూలులో పసికందు కిడ్నాప్​ కేసు సుఖాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.