రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎస్పీ సిద్దార్థ కౌశల్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కొంతమందిని విచారించగా.. నరసరావుపేటకు చెందిన సుబ్బారావు, నెల్లూరుకు చెందిన నారాయణస్వామి లు కూడా పీడీఎస్ రైస్ కు మధ్యవర్తులుగా వ్యవహరించి వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారని తేలింది. వలపర్ల గ్రామంలోని వెంకట సాయి రైస్ మిల్ నుంచి సెప్టెంబర్ 24వ తేదీన 550 బస్తాల రేషన్ బియ్యాన్ని లారీలో లోడ్ చేసి.. చెన్నై పోర్టుకు తరలించారు.
ఈ సమాచారంతో మార్టూరు ఎస్ ఐ శివకుమార్ , సిబ్బంది చెన్నై పోర్ట్ కు వెళ్లి ఆ రైస్ ను గుర్తించి పోర్టు అధికారులతో మాట్లాడారు. వాటిని పరిశీలించి ఇస్తామని కష్టమ్స్ కమిషనర్ చెప్పారు. విచారించిన కష్టమ్స్ అధికారులు.. బియ్యాన్ని తీసుకెళ్ళమని పోలీసులకు చెప్పారు... దీంతో ఎస్.ఐ శివకుమార్, సిబ్బంది, వలపర్ల విఆర్ఓ, సెక్రెటరీ కలసి చెన్నై పోర్టుకు వెళ్ళి రైస్ లోడ్ చేసుకొని చెన్నై నుంచి మార్టూరు కు తీసుకొని వచ్చి రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: