ప్రకాశం జిల్లా ఒంగోలు శర్మ కళాశాల మైధానంలో ఆంధ్ర, దిల్లీ టీంల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదటి రోజు ఆంధ్ర టీం టాస్ గెలిచి... ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి 70.5 ఓవర్లలో 215 పరుగులకే దిల్లీ జట్టు కుప్పకూలింది. బౌలర్ శశికాంత్ 20.5 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి దిల్లీ పతనాన్ని శాసించాడు. మరొక బౌలర్ విజయ్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దిల్లీ జట్టు కెప్టెన్ నితీష్ రాణా, యాదవ్‌లు అర్ధ శతకాలతో స్కోర్‌ను రెండు వందలు దాటించారు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర జట్టు... మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. కెప్టెన్ హనుమ విహారి క్రీజులో ఉన్నాడు.
ఇదీ చూడండి: చీరాలలో రసవత్తరంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్