ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనాతో ఓ బాలింత మృతి చెందింది. బాలింతగా ఉన్న ఆమెకు ఆరోగ్యం బాగాలేదని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఒంగోలు జీజీహెచ్ తీసుకువెళ్లగా కోవిడ్ బాధితురాలుగా భావించి కోవిడ్ వార్డుకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది..
ఆమెకు ఎక్కడ దహనసంస్కరణలు చేపట్టాలనే విషయంపై రెండు రోజులు తర్జనభర్జన జరిగింది. ఆర్టీసి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్మశానవాటిక వద్ద దహన సంస్కరణలు చేపట్టాలని భావించినా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నవారి ఊరు పామూరుకు తీసుకువెళ్లడానికీ వీలు పడని పరిస్థితి నెలకొంది. సోమవారం అంత్యక్రియలు చేయడానికి వీలుపడలేదు.
జీజీహెచ్ శవాలగదిలోనే మూడు రోజులు మృతదేహాన్ని భద్రపరిచారు. రెవెన్యూ, పోలీసులు, వైద్య అధికారులు సంప్రదింపులు జరిపి చివరికి ఒంగోలు కమ్మపాలెంలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు సమక్షంలో, ప్రత్యేక రక్షణ ఏర్పాట్లతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె బంధువులు, పిల్లలకు చివరిచూపు దక్కకపోవడం ఆవేదన మిగిల్చింది.
ఇది చదవండి వారందరికీ మోదీ అండ- వీరందరికీ హెచ్చరిక